Jofra Archer Tests Negative For Coronavirus: ‘బయో సెక్యూర్’ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు క్షమాపణలు కోరడంతో పాటు మరోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాదని బోర్డుకు హామీ ఇవ్వడంతో ఆర్చర్ మళ్లీ జట్టుతో కలిశాడు. మంగళవారం అతడికి కరోనా టెస్టులు నిర్వహించగా.. నెగటివ్ అని తేలడంతో.. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అనుమతులు ఇచ్చింది. దీనితో విండీస్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఆర్చర్ సన్నద్ధం అవుతున్నాడు.