జోఫ్రా దూకుడు చూడాల్సిందే!

వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు జోఫ్రా ఆర్చర్ కేవలం మూడు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే, అతడి ఫామ్‌ని చూసి సెలక్టర్లు వరల్డ్‌కప్ ఆరంభం కావడానికి వారం రోజుల ముందు డేవిడ్ విల్లీ స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో అద్భుత బౌలింగ్‌ చేశాడు. ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 27 పరుగులకే మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనంలో […]

జోఫ్రా దూకుడు చూడాల్సిందే!
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 2:44 PM

వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు జోఫ్రా ఆర్చర్ కేవలం మూడు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే, అతడి ఫామ్‌ని చూసి సెలక్టర్లు వరల్డ్‌కప్ ఆరంభం కావడానికి వారం రోజుల ముందు డేవిడ్ విల్లీ స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో అద్భుత బౌలింగ్‌ చేశాడు. ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 27 పరుగులకే మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌ జట్టులో ఆఖరి నిమిషంలో ఎంపికైన ఆర్చర్‌… సెలెక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్‌లోనే విజృంభించాడు.

ఆర్చర్‌ ప్రపంచకప్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్‌కి ప్రాతినిథ్యం వహిస్తూ ప్రపంచకప్‌లో ఆడటం చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న దానికన్నా నాలుగేళ్ల ముందే ఇక్కడ ఆడుతున్నా. నా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు. ఈ ప్రపంచకప్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడటంపై స్పందిస్తూ.. ‘నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు ఐపీఎల్‌ ఎంతో తోడ్పడింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడటం గొప్ప అనుభూతి. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ప్రపంచకప్‌లో ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదం చేస్తుంది’ అని వివరించాడు.