వినియోగదారులకు బంపర్ అఫర్ ప్రకటించింది జియో ఫైబర్ నెట్. ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు అమెజాన్ ఫ్రైమ్ తో జత కలుస్తోంది. ఇక ఫ్రీగా నచ్చిన సినిమాలను చూసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
జియో తమ వినియోగదారులకు రూ.999 విలువ చేసే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, గోల్డ్, ఆపై ప్లాన్లు కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు, అమెజాన్ మ్యూజిక్ కూడా యూజర్లకు ఉచితంగా లభించనుంది.
జియో ఫైబర్ వాడుతున్న ప్రస్తుత వినియోగదారులు కూడా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇక ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం మీ సెటాప్ బాక్సులో పాత అమెజాన్ అకౌంట్‌తో లాగిన్‌తో కావల్సి ఉంటుంది. మై జియో యాప్, జియో.కామ్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లు కలిగిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిల్వర్, బ్రాంజ్ ప్లాన్లు కలిగిన వారు ఈ ఆఫర్ కావాలంటే గోల్డ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి ఉంటుంది. ఇక ఎయిర్టెల్ సైతం రూ.999 కంటే ఎక్కువ మొత్తం కలిగిన ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.