మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోం డెలివరీ..

మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక మీదట ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్‌పూర్‌, బొకారో లాంటి 9 పట్టణాల్లో లిక్కర్‌ను ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటలతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 15 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే సౌకర్యం ఉందన్న జార్ఖండ్ ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తగ్గించేందుకు ఆన్‌లైన్‌ డెలివరీకి అనుమతి […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోం డెలివరీ..

మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక మీదట ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్‌పూర్‌, బొకారో లాంటి 9 పట్టణాల్లో లిక్కర్‌ను ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటలతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 15 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే సౌకర్యం ఉందన్న జార్ఖండ్ ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తగ్గించేందుకు ఆన్‌లైన్‌ డెలివరీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.

కరోనా నేపధ్యంలో మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరి అని.. అలాగే డెలివరీ బాయ్స్ కూడా తమ వెంట ఎలప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉంచుకోవడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.  కాగా, లాక్ డౌన్ 4.0లో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందులో భాగంగానే అన్ని మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు జార్ఖండ్ సర్కార్ అనుమతులు మంజూరు చేసింది.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…