Khammam: సంచితో వచ్చాడు.. క్షణాల్లో ఉంగరాల బాక్స్ ఎత్తుకెళ్లిపోయాడు..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్‌లో ఆచారి జ్యుయలరీ షాపులో దొంగ ఒకటి ఉంగరాల బాక్స్‌తో సహా చోరీ చేసి పారిపోయాడు. షాపు యజమాని భోజనం కోసం లోపలికి వెళ్లిన సమయంలో, గుర్తు తెలియని దొంగ డిస్ప్లేలో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాలను సచిలో పెట్టుకొని బయటకు పారిపోయాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్‌లోని ఆచారి జ్యుయలరీ షాపులో దొంగ ఒక ఉంగరాల బాక్స్‌ను చోరీ చేసి పారిపోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. షాపు యజమాని భోజనం చేసేందుకు లోనికి వెళ్లిన వెంటనే, అదే సమయంలో గుర్తు తెలియని దొంగ షాప్‌లోకి వచ్చి డిస్ ప్లేలో ఉన్న ఉంగరాల బాక్స్‌ను తీసుకొని సంచి వేసి బయటకు పారిపోయాడు. దాంతో, షాపు యజమాని భార్య బాక్స్‌ను ఎత్తుకెళ్తున్నాడని గుర్తించి వెంటనే వెంట పడినా దొంగ అదృశ్యమైపోయాడు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా, దొంగ సుమారు సుమారు 6 లక్షలు విలువ చేసే 36 గ్రాముల బంగారు ఉంగరాలు చోరీ చేసి తీసుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రింగ్ రోడ్ సెంటర్‌కి చెందిన ఈ ప్రాంతం నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండటంతో, ఈ స్థలంలో క్షణాల్లో జరిగిన చోరీ స్థానికులను షాక్‌కు గురి చేసింది.
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

