జెట్ నుంచి వైదొలిగిన నరేశ్‌ గోయల్‌

|

Mar 25, 2019 | 4:39 PM

ముంబయి: అప్పుల్లో కూరుకుపోయి..కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా  ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కోలుకునేదిశగా తొలి అడుగు పడింది. ఎట్టకేలకు ఆ సంస్థ ఛైర్మన్ నరేశ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు..గోయల్ భార్య అనిత కూడా బోర్డు డైరక్టర్ల పదవుల నుంచి తప్పుకున్నట్లు జెట్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 1993లో నరేశ్‌ గోయల్ జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థలో గోయల్‌ కుటుంబానికి 51శాతం వాటా ఉంది. అయితే గత కొంతకాలంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ […]

జెట్ నుంచి వైదొలిగిన నరేశ్‌ గోయల్‌
Follow us on

ముంబయి: అప్పుల్లో కూరుకుపోయి..కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా  ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కోలుకునేదిశగా తొలి అడుగు పడింది. ఎట్టకేలకు ఆ సంస్థ ఛైర్మన్ నరేశ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు..గోయల్ భార్య అనిత కూడా బోర్డు డైరక్టర్ల పదవుల నుంచి తప్పుకున్నట్లు జెట్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

1993లో నరేశ్‌ గోయల్ జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థలో గోయల్‌ కుటుంబానికి 51శాతం వాటా ఉంది. అయితే గత కొంతకాలంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి దిగజారిపోయింది. ఆర్థిక ఇబ్బందులు నానాటికీ పెరిగిపోయాయి.  చివరకు లీజు చెల్లించలేక మూడో వంతు విమానాల సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత యాజమాన్యంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ కొనసాగడం కష్టమని ఇటీవల ఎస్‌బీఐ సహా బ్యాంకర్లు వెల్లడించారు. సంస్థ పునరుద్ధరణ కోసం వేరేవారికి అప్పగించడమే మంచిదని వారు ప్రతిపాదించారు. బ్యాంకర్ల ఒత్తిడితో నరేశ్ గోయల్‌ రాజీనామా చేయక తప్పలేదు. కాగా.. గోయల్‌ రాజీనామాతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రాణించాయి. నేటి ట్రేడింగ్‌లో సంస్థ షేర్లు 15శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.