జేఈఈ మెయిన్​ షెడ్యూల్ వచ్చేసిందోచ్..ఈ ఏడాది నాలుగు సార్లు.. విద్యార్థులు మీరు రెడీ నా..!

|

Dec 15, 2020 | 7:56 PM

జేఈఈ మెయిన్​ షెడ్యూల్​ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. వచ్చే ఏడాది నిర్వహించబోయే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల అయ్యింది. ఈసారి నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

జేఈఈ మెయిన్​ షెడ్యూల్ వచ్చేసిందోచ్..ఈ ఏడాది నాలుగు సార్లు.. విద్యార్థులు మీరు రెడీ నా..!
Follow us on

JEE Main 2021 : జేఈఈ మెయిన్​ షెడ్యూల్​ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. వచ్చే ఏడాది నిర్వహించబోయే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల అయ్యింది. ఈసారి నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది.

గతంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. మంగళవారం  నుంచి జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది.

ఫీజు చెల్లింపునకు జనవరి 16వరకు తుదిగడువు ఇచ్చిన ఎన్టీఏ తన ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల్లో మార్పులు, మార్పులు చేర్పులకు జనవరి 18 నుంచి 21 వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి మొదటి వారంలో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది.

ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్​ (JEE) మొదటి పరీక్ష జరగనుంది. మంగళవారం నుంచి జనవరి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రోజుకు రెండు విడతల్లో ఆన్​లైన్​లో ఈ పరీక్షలను ఏర్పాటు చేసింది ఎన్​టీఏ. అయితే మరో 3 విడతల్లో పరీక్షలు.. మార్చి, ఏప్రిల్​, మే నెలలో జరగనున్నాయి.