HUNGER STRIKE: ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి…

శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దీక్షను భగ్నం చేయాలని...

HUNGER STRIKE: ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి...

Updated on: Jan 04, 2021 | 5:09 AM

శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దీక్షను భగ్నం చేయాలని పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు. ఒక్కరి కోసం ఇంత మంది పోలీసులు రావడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. దుర్వినియోగం అవుతున్న అట్రాసిటి చట్టాన్ని కాపాడేందుకే దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదన్నారు. పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. కాగా జేసీ దీక్ష నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. దీక్షలు చేసేందుకు ఎవరికి అనుమతులు లేవని పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పెద్దారెడ్డి మాత్రం జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ అస్థిత్వం కోసం దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

 

Also Read: ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్

 

Loading...
Unable to load recommendations.
Follow Us