ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రపంచకప్ మొత్తం ఓ ఎత్తయితే.. ఈ మ్యాచ్ ఒకటీ మరో ఎత్తు.. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి ఓ పాకిస్థాన్ టీవీ ఛానల్.. భారత్ వింగ్ కమాండర్ అభినందన్‌ను అవమానించేలా ఓ వీడియోను తయారు చేసి వివాదానికి తెర లేపింది.
ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ భారత్ పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు వింగ్ కమాండర్ అభినందన్. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఈ ఆపరేషన్‌లో పాక్ చేతికి చిక్కాడు. ఆయన్ని చిత్ర హింసలకు గురి చేసిన పాక్.. చివరికి అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక భారత్‌కు అప్పగించింది.
ఆ సమయంలో పాక్ అధికారులు అభినందన్‌ను విచారిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను నమూనాగా పాక్ ఛానల్.. జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌ను జత చేసి ఓ టీవీ యాడ్‌ను రూపొందింది. అభినందన్ మీసకట్టును కలిగి టీమిండియా జెర్సీ ధరించిన ఓ నటుడిని ప్రపంచ కప్ గురించి ప్రశ్నించడమే ఈ యాడ్ కాన్సెప్ట్. ఇండియా టాస్ గెలిస్తే ఏం చేస్తుందని వారు ప్రశ్నించగా సారీ…నేనేమి చెప్పకూడదంటూ అతడు సమాధానం చెబుతాడు. ఇలా అతడు టీ తాగుతూనే రెండు మూడు ప్రశ్నలకు సేమ్ సమాధానం చెబుతాడు. ఇక చివరగా టీ కప్‌తో వెళ్తుంటే.. ఆ కప్పును ఎక్కడికి తీసుకువెళ్తున్నావంటూ లాగేసుకుంటారు. ఇది ఈ యాడ్ సారాంశం. క్రియేటివ్ కోణంలో ఈ యాడ్ బాగానే ఉన్నా.. భారత్ జెర్సీ ధరించి.. అభినందన్‌ను కించపరచడం భారత్ అభిమానులకు నచ్చట్లేదు. ఏది ఏమైనా ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు ఇప్పటి నుంచే సెగ మొదలవడంతో క్రీడాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Jazz TV advt on #CWC19 takes the Indo-Pak air duel to new level. It uses the air duel over Nowshera and Wing Co Abhinandan Varthaman’s issue as a prop. @IAF_MCC @thetribunechd @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/30v4H6MOpU
— Ajay Banerjee (@ajaynewsman) June 11, 2019