
విచక్షణ కోల్పోయిన ఓ కసాయి తల్లి, అమ్మమ్మను పొట్టనబెట్టుకున్నాడు. జపాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒసాకాకు సమీపంలో ఓ యువకుడు క్రాస్ బౌ అనే విల్లుతో కుటుంబసభ్యలుపై దాడి చేసి.. తన తల్లిని, అమ్మమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
హ్యోగో ప్రిఫెక్చర్‌లోని తకారాజుకాలోని 23 ఏళ్ల హిడాకి నోజు అనే విద్యార్థి తన కుటుంబసభ్యులపై క్రాస్‌బౌ అనే బాణాలతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి(40), అమ్మమ్మ(70) అక్కడిక్కడే మృతి చెందగా తమ్ముడు, బంధువైన మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యుల అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. హత్యలకు పాల్పడ్డ హిడాకి నోజు అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జపాన్‌లో ఇటువంటి హింసతో కూడిన నేరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది.