NEW CORONA STRAIN : జపాన్ ప్రభుత్వ కీలక నిర్ణయం..విదేశీల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం

| Edited By: Ram Naramaneni

Dec 27, 2020 | 8:47 PM

కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. యూకేలో బయటపడ్డ కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్..

NEW CORONA STRAIN : జపాన్ ప్రభుత్వ కీలక నిర్ణయం..విదేశీల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం
Follow us on

కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. యూకేలో బయటపడ్డ కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్.. జపాన్‌కూ కూడా పాకింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ఆ దేశం దృష్టిసారించింది.

ఇందులో భాగంగా విదేశీ ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు డిసెంబర్ 28 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. జనవరి చివరి వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి వెళ్లే జపాన్ పౌరులకు, విదేశీ నివాసితులకు.. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది.

దీంతోపాటు 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాలని నిర్ణయించింది. బ్రిటన్ నుంచి జపాన్‌కు వచ్చిన ఐదుగురికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని జపాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి.. కొవిడ్-19 కంటే 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డట్టు గుర్తు చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసమే విదేశీ పౌరుల రాకను తాత్కాలికంగా అడ్డుకుట్టున్నట్టు వివరించారు.