జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవోపై వేటు

|

Jul 09, 2020 | 12:07 PM

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు‌పై సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారే...

జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవోపై వేటు
Follow us on

Jangareddigudem Maddi Anjaneya Swamy Temple EO Suspended : పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎంపీ, మంత్రి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఇద్దరు రాజుల రాజకీయ పోరాటం సామాన్య ఉద్యోగులకు చలగాటంగా మారుతోంది. తాజగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కు సన్నిహితంగా ఉన్నందుకు ఓ దేవాలయ ఈఓపై వేటుపడింది.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు‌పై సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారే ఆరోపణలపై ఈవో విశ్వనాధరాజుపై దేవాదాయ శాఖ కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

రాజకీయ నాయకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం, కోడి పందేల్లో పాల్గొనడం వంటి కారణాలతో సస్పెండు చేసినట్లు దేవదాయశాఖ సహాయ కమిషనర్ పల్లంరాజు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్‌ తనిఖీదారు టీవీఎస్‌ఆర్‌ ప్రసాదుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.