ఢిల్లీ బ్లాస్ట్, మాదే బాధ్యత, జైష్-ఉల్-హింద్ ప్రకటన, ఇజ్రాయెల్ నుంచి త్వరలో ఢిల్లీకి దర్యాప్తు బృందం

| Edited By: Pardhasaradhi Peri

Jan 30, 2021 | 1:25 PM

ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన పేలుడుకు తమదే బాధ్యత అని జైష్-ఉల్-హింద్ ప్రకటించుకుంది. ఈ దాడికి గర్విస్తున్నామని..

ఢిల్లీ బ్లాస్ట్, మాదే బాధ్యత, జైష్-ఉల్-హింద్ ప్రకటన, ఇజ్రాయెల్ నుంచి త్వరలో ఢిల్లీకి దర్యాప్తు బృందం
Follow us on

ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన పేలుడుకు తమదే బాధ్యత అని జైష్-ఉల్-హింద్ ప్రకటించుకుంది. ఈ దాడికి గర్విస్తున్నామని పేర్కొంది. అయితే ఈ సంస్థ చేసిన ఈ ప్రకటనపై దర్యాప్తు సంస్థలు ఇంకా ఆరా తీస్తున్నాయి. ఈ పేలుడు ఘటనను ఇజ్రాయెల్ ‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’ గా అభివర్ణిస్తూ ఖండించింది. ఈ బ్లాస్ట్ పై భారత దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు ఇజ్రాయెల్ నుంచి ఇన్వెస్టిగేటివ్ బృందం త్వరలో ఢిల్లీకి రానుంది. పేలుడు జరిగిన స్థలం వద్ద స్వాధీనం చేసుకున్న లేఖలో .. అరపేజీ వరకు చేతిరాత ఉందని, అది అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు-జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ ఐ ఏ ) కి చెందిన ఏడుగురు అధికారుల బృందం ఈ ఉదయం  ఘటనాస్థలానికి చేరుకుంది. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు ఓ క్యాబ్ నుంచి దిగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి.