గిరీష్‌ కర్నాడ్‌కు తెలుగు సీఎంల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. దేశ నాటక, సాహిత్యరంగంలో గిరీష్‌ ఎనలేని కృషిచేశారని, ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. గిరీష్‌ కర్నాడ్‌ కుటుంబ సభ్యులకు జగన్‌, కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా కర్నాడ్‌ సేవలు శ్లాఘనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]

గిరీష్‌ కర్నాడ్‌కు తెలుగు సీఎంల సంతాపం

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2019 | 6:59 PM

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. దేశ నాటక, సాహిత్యరంగంలో గిరీష్‌ ఎనలేని కృషిచేశారని, ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. గిరీష్‌ కర్నాడ్‌ కుటుంబ సభ్యులకు జగన్‌, కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా కర్నాడ్‌ సేవలు శ్లాఘనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన సినిమాల్లో, రచనల్లో సామాజిక అభ్యుదయం ఆకాంక్షించారని తెలిపారు. సామాజికవేత్తగా గిరీష్‌ చేసిన సేవలు స్ఫూర్తిదాయమన్నారు. గి కర్నాడ్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.