అసోం సీఎంకు జగన్ ఫోన్.. వాటిని ఆపొద్దని విఙ్ఞప్తి

|

Apr 18, 2020 | 4:24 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసోం సీఎం శరబానంద సోనోవాల్‌‌కు ఫోన్ చేశారు. పొరుగున వున్న ఏ ముఖ్యమంత్రిని కాదని ఏకంగా సుదూరంలో వున్న అసోం రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్ ఎందుకు ఫోన్ చేశారు ?

అసోం సీఎంకు జగన్ ఫోన్.. వాటిని ఆపొద్దని విఙ్ఞప్తి
Follow us on

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసోం సీఎం శరబానంద సోనోవాల్‌‌కు ఫోన్ చేశారు. పొరుగున వున్న ఏ ముఖ్యమంత్రిని కాదని ఏకంగా సుదూరంలో వున్న అసోం రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్ ఎందుకు ఫోన్ చేశారు ? ఇదిపుడు అమరావతిలో హాట్ టాపిక్. అయితే.. అసోం ముఖ్యమంత్రికి జగన్ ఫోన్ చేయడం వెనుక కారణాన్ని కనుగొంది టీవీ9 వెబ్ సైట్.

అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌తో ఫోన్లో మాట్లాడారు ఏపీ సీఎం వైయస్‌.జగన్‌. ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకులను తొలగించాలని దృష్టిపెట్టాలని జగన్‌ అసోం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని జగన్ అసోం ముఖ్యమంత్రిని కోరారు.

అసోంలో చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసోం సీఎంకు విజ్ఞప్తి చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు, అసోం సీఎం సోనోవాల్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని అసోం సీఎం ఆంధ్రా సీఎం జగన్‌ను కోరారు. దానికి జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.