Ivanka Trump: భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌లో ఆమె హైదరాబాద్‌ను గుర్తుకు తెచ్చుకొని మరీ ట్వీట్ చేయడం ఆసక్తికరం. ‘‘రెండేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నా. ఆ తర్వాత మళ్లీ మోదీని కలుస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య స్నేహాన్ని వేడుక చేసుకోడానికి ఇండియాకు తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.
2017 లో హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ఇవాంక ట్రంప్ మరోసారి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
[svt-event date=”24/02/2020,11:54AM” class=”svt-cd-green” ]
Two years after joining @narendramodi at the Global Entrepreneurial Summit in Hyderabad, I am honored to return to India with @POTUS and @FLOTUS to celebrate that the grand friendship between the world’s two largest democracies has never been stronger! ?? ?? pic.twitter.com/r1d5fl9mtq
— Ivanka Trump (@IvankaTrump) February 23, 2020