
తెలుగులో బొమ్మరిల్లు సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఇట్స్ మై లైఫ్ పేరుతో హిందీలోనూ రిమేక్ చేశారు. ఎప్పుడో 2007లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వివిధ కారణాల వల్ల రిలీజ్ కాలేదు. తాజాగా ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత నవంబర్ 29న జీ సినిమా టీవీ ఛానల్లో విడుదలవుతోంది. బోనీకపూర్ నిర్మాణంలో అన్నీస్ బజ్మి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కాగా, తెలుగులో కథానాయికగా నటించిన జెనీలియానే.. హిందీ రిమేక్‌లోనూ నటించింది. కీలకమైన ప్రకాశ్ రాజ్ పాత్రలో నానా పటేకర్.. సిద్ధార్త్ రోల్‌లో హర్మన్ బవేజా నటించారు. కాగా, నవంబర్ 29న జీ సినిమాలో నేరుగా దీన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రొడ్యూసర్ బోనీకపూర్ వెల్లడించారు. దాదాపు పదమూడేళ్ల పాటు ఈ సినిమా విడుదలవుతుండటం గమనార్హం.
Also Read :
గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్, తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు