IT Raids : చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంటిపై ఐటీ దాడుల పంచనామా రిపోర్ట్..

| Edited By: Pardhasaradhi Peri

Feb 16, 2020 | 3:10 PM

IT Raids : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసరావు ఇంటిపై ఐటీదాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు  నాలుగు రోజులపాటు శ్రీనివాస్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఈడీ అధికారులు కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో పాలు పంచుకున్నారు.  ఆ పంచనామా రిపోర్ట్‌ను టీవీ9 ఎక్స్‌క్లూజీవ్‌గా సంపాదించింది.  రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు జరిగినట్టు గతంలో ప్రచారం జరిగినా..కేవలం రూ. 2 లక్షల 63 వేలు మాత్రమే దొరికినట్టుగా […]

IT Raids : చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంటిపై ఐటీ దాడుల పంచనామా రిపోర్ట్..
Follow us on

IT Raids : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసరావు ఇంటిపై ఐటీదాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు  నాలుగు రోజులపాటు శ్రీనివాస్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఈడీ అధికారులు కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో పాలు పంచుకున్నారు.  ఆ పంచనామా రిపోర్ట్‌ను టీవీ9 ఎక్స్‌క్లూజీవ్‌గా సంపాదించింది.  రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు జరిగినట్టు గతంలో ప్రచారం జరిగినా..కేవలం రూ. 2 లక్షల 63 వేలు మాత్రమే దొరికినట్టుగా పంచనామా రిపోర్టులో ఉంది. పంచనామా రిపోర్టు ప్రకారం శ్రీనివాసరావు ఇంట్లో రూ. 2 లక్షల 63 వేల రూపాయల నగదు, రూ 51 లక్షలు విలువైన బంగారం లభించాయి. అయితే వీటిని గుర్తించినట్టుగానే రిపోర్ట్ సూచిస్తుంది కానీ.. సీజ్ చేసినట్టుగా దాఖలాలు కనిపించడం లేదు. ఈ డబ్బు, నగలకు సంబంధించిన అన్ని వివరాలు శ్రీనివాస్ సమర్పించడంతో వాటిని వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది.