హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై యూఐడీఏఐ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ కార్యాలయంలో ఆధార్ సమాచారం లభించడంతో అదెలా వచ్చిందో తెలియజేయాలని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వివరణ కోరుతూ ఢిల్లీలోని ఆధార్ కేంద్రం అధికారులకు లేఖ రాశారు. ఈలేఖపై స్పందించిన యూఐడీఏఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆధార్ కార్డు చట్టంలోని 37, 38, 40, 42, 44 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు.