ఇజ్రాయెల్‌లో మరోసారి మూడువారాల లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌ను విధించి, అందుకు సంబంధించిన నియమ నిబంధనలకు కఠినాతికఠినంగా అమలు చేసినా కరోనా వైరస్‌ మాత్రం కట్టడి కాలేదు. పైపెచ్చు అది మరింతగా వ్యాప్తి చెందుతూ వెళుతోంది..

ఇజ్రాయెల్‌లో మరోసారి మూడువారాల లాక్‌డౌన్‌
Follow us

|

Updated on: Sep 14, 2020 | 12:23 PM

లాక్‌డౌన్‌ను విధించి, అందుకు సంబంధించిన నియమ నిబంధనలకు కఠినాతికఠినంగా అమలు చేసినా కరోనా వైరస్‌ మాత్రం కట్టడి కాలేదు. పైపెచ్చు అది మరింతగా వ్యాప్తి చెందుతూ వెళుతోంది.. లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు, లేనిపోని సమస్యలు కూడా తలెత్తడంతో ప్రభుత్వాలు నెమ్మదిగా లాక్‌డౌన్‌ను సడలించడం మొదలుపెట్టాయి.. ఆన్‌లాక్‌తో చాలా వాటిని సడలించాయి.. అయితే కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి.. ఇక ఇజ్రాయెల్ అయితే మరోసారి లాక్‌డౌన్‌ విధించాలనే కఠిన నిర్ణయానికి వచ్చింది.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు బాగా పెరుగుతుండటంతో మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. మూడు వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్‌కు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మూడు వారాల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్‌ను పొడిగించడమా లేక తొలగించడమా అన్నది ఆలోచిస్తామని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్‌లో రోజుకు నాలుగు వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇప్పటికే కరోనా వైరస్‌ కారణంగా ఇజ్రాయెల్‌ ఆర్ధిక వ్యవస్థ పెను సంక్షోభంలో పడింది.. ఇప్పుడు రెండోసారి లాక్‌డౌన్‌ విధిస్తే కనీసం 1.88 బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఆ దేశ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప అన్నింటినీ మూసివేస్తున్నారు. దేశంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.. అయితే యూదుల కొత్త సంవత్సరానికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.. యూకోవ్‌ లిట్జ్మాన్‌ అనే మంత్రి అయితే తన పదవికి రాజీనామా కూడా చేశారు.. ఇజ్రాయెల్‌లో ఇప్పటివ‌ర‌కు 1,53,759 క‌రోనా కేసులు నమోదయ్యాయి.. వెయ్యికి పైగా ప్రజలు మరణించారు.. దీనికే అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ ఆందోళనలు చేశారు..

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?