తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసులకు చిక్కిన బుకీలు

|

Oct 11, 2020 | 7:30 PM

ఊరూవాడా బెట్టింగ్‌ ఊపేస్తోంది.. పల్లెపట్నం బెట్టింగ్‌ మాయలో పడుతోంది. ఐపీఎల్‌ ఫీవర్‌లో పడుతున్న యువత ఉసూరుమంటోంది.. తాజాగా పలు జిల్లాల్లో బెట్టింగ్‌ బ్యాచ్‌ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది..

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసులకు చిక్కిన బుకీలు
Follow us on

ఊరూవాడా బెట్టింగ్‌ ఊపేస్తోంది.. పల్లెపట్నం బెట్టింగ్‌ మాయలో పడుతోంది. ఐపీఎల్‌ ఫీవర్‌లో పడుతున్న యువత ఉసూరుమంటోంది.. తాజాగా పలు జిల్లాల్లో బెట్టింగ్‌ బ్యాచ్‌ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐపీఎల్ బెట్టింగ్‌లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలు, 14 మంది బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 17 మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఇతర సామగ్రిని నూజివీడు పోలీసులు సీజ్ చేశారు. బుకీలు, బెట్టింగ్‌రాయుళ్లను మీడియాకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చూపించారు.

ఇక.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఐపీఎల్‌ బెట్టింగ్‌ దర్జాగా సాగుతోంది.. పోలీసులు దాడిలో ఆరుగురు యువకులు పట్టుబడ్డారు. ఇందులో ఒకరు పరారు కాగా.. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, 87 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. కార్వాన్‌కు చెందిన ఆకాష్‌సింగ్, వినయ్‌సింగ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, లక్షా 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.