IPL 2024: ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు బీసీసీఐ భారీ షాక్.. అసలు ఏం జరిగిందంటే?

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్‌లకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ భారీ జరిమానా విధించింది.

IPL 2024:  ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు బీసీసీఐ భారీ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
Tim David, Kieron Pollard
Follow us

|

Updated on: Apr 20, 2024 | 6:42 PM

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్‌లకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ భారీ జరిమానా విధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించి క్రీజులో ఉన్న సూర్యకుమార్‌కు డీఆర్‌ఎస్ తీసుకోమని డేవిడ్, పొలార్డ్ సైగలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు సైగలు చేయడాన్ని గమనించిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ సామ్ కరణ్.. ఈ చర్యను ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్ కరణ్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిద్దరికి బీసీసీఐ జరిమానా విధించింది.

దీని ప్రకారం వీరిద్దరూ మ్యాచ్ ఫీజులో 20 శాతం పెనాల్టీగా చెల్లించాలి. మ్యాచ్ రిఫరీ ముందు విచారణ సందర్భంగా టిమ్ డేవిడ్, పొలార్డ్ తమ తప్పును అంగీకరించారు. దీంతో ఇద్దరికి జరిమానాతో సరిపెట్టింది బీసీసీఐ. ‘ఇద్దరికి జరిమానా విధించాం. టిమ్ డేవిడ్ , పొలార్డ్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డారు. దీని కారణంగా, డేవిడ్ మరియు పొలార్డ్‌లకు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాం’ అని IPL తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

సైగలతో డీఆర్ఎస్..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 15వ ఓవర్ వేశాడు. ఈ సమయంలో స్ట్రైక్‌లో ఉన్న సూర్యకుమార్‌కి డగౌట్‌ నుంచి వైడ్‌ బాల్‌ కోసం డీఆర్‌ఎస్‌ తీసుకోవాలని వారిద్దరూ సూచించారు. వీరిద్దరి సైగతో సూర్యకుమార్‌ డీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. దీంతో అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాల్సి వచ్చింది. దీనిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం కారణంగా డేవిడ్, పోలార్డ్ లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..