AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి ఊతం ఇస్తోంది తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.

ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?
Ravi Kiran
|

Updated on: Oct 13, 2020 | 9:14 AM

Share

IPL 2020: ఐపీఎల్ 2020 జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. చివరి బాల్ వరకు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి ఊతం ఇస్తోంది తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.

ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఫైనల్ స్కోర్‌ను ముందుగానే రివీల్ చేస్తూ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్ చేసింది. కొద్దిసేపటికి ఆ ట్వీట్ డిలీట్ అయినా.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ ఆరంభమైన తొలి ఓవర్‌లోనే ఢిల్లీ చేయబోయే స్కోర్‌ను ఇంచుమించుగా ముంబై ఇండియన్స్ చెప్పేసింది.

ఢిల్లీ 19.5 ఓవర్లకు 163/5 చేస్తుందంటూ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది యాధృచ్చికమా లేక ఏదైనా విషయం ఉందా అనేది తెలియదు గానీ.. ఇప్పుడు నెటిజన్లలో ఇదే హాట్ టాపిక్. ముంబై ట్వీట్ చేసినట్లుగానే ఢిల్లీ 20 ఓవర్లకు 166/5 పరుగులు చేసింది.

ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఫిక్స్ అయిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ముందుగానే స్కోర్‌ను ఫిక్స్ చేసుకుని మరీ ఆడతారా అంటూ ముంబై ఇండియన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ట్వీట్‌ను మార్ఫింగ్ ఫోటో అని చెప్పిన వారు కూడా లేకపోలేదు.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?