IPL 2020, RCB vs KKR : భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ, కోల్‌కతా టార్గెట్ 195

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‌

IPL 2020, RCB vs KKR : భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ, కోల్‌కతా టార్గెట్ 195
Follow us

|

Updated on: Oct 12, 2020 | 9:57 PM

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‌ ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌: 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆరంభంలో అరోన్‌ ఫించ్‌(47: 37 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌ ), దేవదత్‌ పడిక్కల్‌(32: 23 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(33 నాటౌట్: 28 బంతుల్లో ఫోర్‌) తన పాత్ర పోషించాడు.

ఓపెనింగ్‌ జోడీని కోల్‌కతా బౌలర్లు ఏ దశలోనూ విడదీయలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు రాబట్టింది ఆర్సీబీ టీమ్. దాటిగా ఆడుతున్న పడిక్కల్‌ (32) రసెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఫించ్‌(47) కూడా బౌల్డై పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ నిదానంగా ఆడుతుండగా మరో ఎండ్‌లో అరోన్‌ ఫించ్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 15 ఓవర్లకు ఆర్‌సీబీ 111/2తో మెరుగైన స్థితిలో ఉన్నా.. ఆఖర్లో డివిలియర్స్‌ అద్భుతమైన షాట్లు ఆడటంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.  ( పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )