IPL 2020: టైటిల్ ఖచ్చితంగా ఎగరేసుకుపోతాంః వార్నర్

2016లో తమకు ఎదురైన పరిస్థితే.. ఈ సీజన్‌లో కూడా రిపీట్ అవుతోందని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆ సమయంలో లీగ్ స్టేజిలో..

IPL 2020: టైటిల్ ఖచ్చితంగా ఎగరేసుకుపోతాంః వార్నర్
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2020 | 1:56 PM

IPL 2020: 2016లో తమకు ఎదురైన పరిస్థితే.. ఈ సీజన్‌లో కూడా రిపీట్ అవుతోందని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆ సమయంలో లీగ్ స్టేజిలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి.. టైటిల్ ఎగరేసుకుపోయామని.. ఈ సీజన్‌లో కూడా ఖచ్చితంగా అలాంటి ఫలితాలే సాధిస్తామని అతడు ధీమా వ్యక్తం చేశాడు. గత రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ సేన 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు అనూహ్యంగా నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడాడు.. ”ప్రస్తుతం మా బౌలర్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. విజయ్ శంకర్‌ను కోల్పోవడం జట్టుకు పెద్ద లోటు. మా బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో కాస్త విఫలమైనప్పటికీ.. ఆ సమన్యను తొందర్లోనే అధిగమిస్తాం. ఇక ఆల్‌రౌండర్‌ జసన్ హోల్డర్ ప్రతీ మ్యాచ్‌లో రాణించడం శుభ పరిణామం. ముంబైతో జరిగే మ్యాచ్‌ కూడా మేము తప్పక గెలవాలని తెలుసు. టైటిల్ గెలిచే దాకా మా పోరాటం కొనసాగుతుంది. 2016లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవడంతో గెలిచి చూపించాం’ అని పేర్కొన్నాడు.