IPL 2020: తిరుగులేని ఢిల్లీ.. విజయాలకు వారిద్దరే కారణం.!

|

Oct 10, 2020 | 2:07 PM

ఈ ఏడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి దుమ్ములేపుతోంది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌లతో ఐపీఎల్ 2020లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

IPL 2020: తిరుగులేని ఢిల్లీ.. విజయాలకు వారిద్దరే కారణం.!
Follow us on

IPL 2020: ఈ ఏడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి దుమ్ములేపుతోంది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌లతో ఐపీఎల్ 2020లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదింటిలో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీకి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండూ కూడా బలంగా ఉన్నాయి. స్కోర్ ఎంతైనా కూడా దాన్ని కాపాడటంలో ఢిల్లీ బౌలర్లు దిట్ట.

దక్షిణాఫ్రికా ద్వయం రబాడా, నోర్తజేలు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్ధులను బెదరగోడుతున్నారు. అలాగే ఆల్‌రౌండర్‌గా స్టోయినిస్, హెట్‌మెయిర్ అదరగొడుతుండగా.. స్పిన్ విభాగం రవిచంద్రన్ అశ్విన్ సారధ్యంలో అత్యంత బలంగా ఉందని చెప్పాలి. బ్యాటింగ్‌లో అయితే పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్.. ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు రాబడుతున్నారు.

ముఖ్యంగా ఈ ఢిల్లీ జట్టు గురించి చెప్పాలంటే.. ముందుగా ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ గురించి చెప్పాలి. అతడి కోచింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. ప్రతీ ఆటగాడికి ఫ్రీడం ఇస్తూ.. తనలోని ప్రతిభను బయటపెడుతున్నాడు. దానికి నిదర్శనం స్టోయినిస్. బెంగళూరు జట్టులో పేలవ ఫామ్ కనబరిచిన అతడు. ఇక్కడ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ ప్రతి విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పాంటింగ్ పర్యవేక్షణలో యువ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం ఫిదా చేస్తోంది. కూల్ కెప్టెన్‌గా ఫీల్డ్‌లో చక్కగా రాణిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్సీలో 2019 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరిన ఢిల్లీ.. ఈసారి కప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read:

మ్యాక్స్‌వెల్.. ఎక్కడ నీ మ్యాడ్‌నెస్‌..!

సీఎస్‌కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..