దంచికొట్టిన ఓపెనర్లు.. హైదరాబాద్ భారీ స్కోర్..

|

Oct 08, 2020 | 9:48 PM

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.

దంచికొట్టిన ఓపెనర్లు.. హైదరాబాద్ భారీ స్కోర్..
Follow us on

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్ వార్నర్(52), బెయిర్‌స్టో(97) మెరుపు ఇన్నింగ్స్‌కు హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

హైదరాబాద్ ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి మెరుపు వేగంతో మొదలైంది. ఓపెనర్లు ఇద్దరూ ఆకాశమే హద్దుగా స్కోర్ బోర్డును కదిలించారు. ఇద్దరూ కూడా తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించారు. అయితే 15వ ఓవర్‌ నుంచి వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది. చివర్లో విలియమ్సన్(20) రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.