రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో గల 42 వైద్యాధికారులు, 84 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైవారు ఈ నెల 17న ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత కలిగి ఏపీ ఎంసీఐ రిజిస్ర్టేషన్ చేయించుకున్న అభ్యర్థులు, స్టాఫ్ నర్స్ పోస్టులకు జీఎన్‌ఎం లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత కలిగి ఏపీ నర్సింగ్ రిజిస్ర్టేషన్ చేయించుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి కలిగిన అబ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్ జెరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు.
ఆస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గతంలోనే ప్రకటించారు. జాతీయ ప్రమాణాల ఐపీహెచ్‌ఎస్‌కు అనుగుణంగా నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యం అయా జిల్లా వైద్య శాఖ అధికారులు స్టాప్ నర్సుల నియామకాన్ని వేగవంతం చేశారు.