కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో త్వరలో తీర్పు

|

Jul 04, 2019 | 10:12 PM

న్యూఢిల్లీ: గూఢచర్య ఆరోపణలు మోపుతూ భారత మాజీ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను అరెస్టు చేసిన పాకిస్థాన్‌.. ఆయనను జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ… ‘‘కొన్ని వారాల్లో ఈ కేసులో తీర్పు వస్తుంది. ఈ […]

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో త్వరలో తీర్పు
Follow us on

న్యూఢిల్లీ: గూఢచర్య ఆరోపణలు మోపుతూ భారత మాజీ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను అరెస్టు చేసిన పాకిస్థాన్‌.. ఆయనను జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ… ‘‘కొన్ని వారాల్లో ఈ కేసులో తీర్పు వస్తుంది. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలను సమర్పించాం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పు వెల్లడించే తేదీని కూడా న్యాయస్థానానికి చెందిన వారే వెల్లడించాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.