గృహ రుణం తీసుకున్నవారికి లక్షన్నర వడ్డీ రాయితీ..!

| Edited By:

Jul 05, 2019 | 2:07 PM

గృహ రుణం తీసుకున్నవారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రూ.45 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి రూ.3లక్షల 50వేల వడ్డీ రాయితీ కలిసివస్తుందని ఆమె అన్నారు. అలాగే.. డిజిటల్ చెల్లింపులపై ఎటుంటి టాక్స్ లేదని తెలిపారు. కాగా.. రూ.2 కోట్ల పైన వార్షిక ఆదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌ఛార్జ్ ఛార్జి చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు అకౌంట్ నుంచి ఏడాదిలో రూ.కోటి డ్రా చేస్తే 2 […]

గృహ రుణం తీసుకున్నవారికి లక్షన్నర వడ్డీ రాయితీ..!
Follow us on

గృహ రుణం తీసుకున్నవారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రూ.45 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి రూ.3లక్షల 50వేల వడ్డీ రాయితీ కలిసివస్తుందని ఆమె అన్నారు. అలాగే.. డిజిటల్ చెల్లింపులపై ఎటుంటి టాక్స్ లేదని తెలిపారు. కాగా.. రూ.2 కోట్ల పైన వార్షిక ఆదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌ఛార్జ్ ఛార్జి చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు అకౌంట్ నుంచి ఏడాదిలో రూ.కోటి డ్రా చేస్తే 2 శాతం పన్ను వేస్తారని అన్నారు. వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే లక్ష్యమన్నారు. ఆమె పేర్కొన్నారు.