గుడ్ న్యూస్: సైబర్ దాడులకు.. బీమా కవరేజి..

| Edited By:

Jun 29, 2020 | 5:05 AM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సైబర్ దాడులు సాధారణం అయ్యాయి. ఈ దాడుల వల్ల నష్టం జరిగే సందర్భంలో... దానిని కొంతమేరకైనా పూడ్చుకునేందుకు బీమాి కవరేజీ ఉంటుందన్న

గుడ్ న్యూస్: సైబర్ దాడులకు.. బీమా కవరేజి..
Follow us on

Insurance coverage for losses due to cyber attacks: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సైబర్ దాడులు సాధారణం అయ్యాయి. ఈ దాడుల వల్ల నష్టం జరిగే సందర్భంలో… దానిని కొంతమేరకైనా పూడ్చుకునేందుకు బీమాి కవరేజీ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సైబర్ ఎటాక్స్, సైబర్ బెదిరింపులు, మాల్వేర్, బ్యాంక్ ఖాతాల చౌర్యం, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లకు సంబంధించిన  వంటి అనధికార, మోసపూరిత ఆర్థిక నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.

కోవిద్-19 కారణంగా పలు సంస్థలు ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారా ఉద్యోగులను పనిచేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే… అన్ని స్థాయిల్లోని సంస్థలకు కూడా ‘సైబర్ భద్రత ’ ప్రమాదం సంభవించే పరిస్థితులేర్పడ్డాయి. ఈ క్రమంలో… ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్… ప్రత్యేకంగా ఓ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రారంభించింది. దీనికి ‘రిటెయిల్ సైబర్ లయలబిలిటీ ఇన్సూరెన్స్’ పేరుతో ఈ పాలసీని అందిస్తున్నారు.

సైబర్ అటాక్ వల్ల నష్టం జరిగే సందర్భాల్లో… రూ. కోటి వరకు ఈ బీమా కింద అందుతుంది. బీమా కవర్ కోసం ప్రీమియం రోజుకు రూ. 6.50 నుంచి రూ. 65 వరకు ఉంటుంది. పరిహారం కింద రూ. 50 వేల నుంచి రూ. కోటి వరకు అందే వెసులుబాటు ఉంటుంది.