అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు ఇవే..

కరోనా మహహ్మారి ధాటికి లాక్‌డౌన్ లోకి వెళ్లిన దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ అర్థరాత్రి నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి.

అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు ఇవే..

కరోనా మహహ్మారి ధాటికి లాక్‌డౌన్ లోకి వెళ్లిన దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ అర్థరాత్రి నుంచి కర్ఫ్యూను కూడా n ఎత్తివేసింది. అలాగే, ఆగస్టు 5 నుంచి జిమ్స్‌, యోగా సెంటర్లకు అనుమతి ఇచ్చింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేసి ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఈ అర్థరాత్రి నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి.

అనుమతి :

* లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగిస్తున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేత.

* జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకునే అవకాశం.

* భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణ.

* ఇండిపెండెంట్ డే సందర్భంగా ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లదే తుది నిర్ణయం.

 

అనుమతించనివి :

* స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలకు అనుమతించని కేంద్రం. ఆగస్టు 31 వరకు వీటిపై నిషేధం యథాతథం.

* విద్యాసంస్థలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం.

* మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియాలపై నిషేధం.

* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం.

* కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం స్పష్టచేసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu