రాహుల్‌ ద్వంద్వ పౌర‌సత్వంపై.. విచార‌ణ‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్‌కు బ్రిట‌న్‌లో పౌర‌స‌త్వం ఉంద‌ని, అందుకే ఆయ‌న్ను ఎంపీగా పోటీ చేయకుండా ర‌ద్దు చేయాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. ఢిల్లీకి చెందిన జై భ‌గ‌వాన్ గోయ‌ల్‌, చంద‌ర్ ప్ర‌కాశ్ త్యాగీలు ఆ పిటిష‌న్ వేశారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ క్షేమం కోసం పిటిష‌న్‌దారులు పోరాటం చేశార‌ని, వారి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ తెలిపారు. రాహుల్‌కి బ్రిటీష్ పౌర‌స‌త్వం ఉంద‌న్న […]

రాహుల్‌ ద్వంద్వ పౌర‌సత్వంపై.. విచార‌ణ‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Edited By:

Updated on: May 02, 2019 | 4:13 PM

రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్‌కు బ్రిట‌న్‌లో పౌర‌స‌త్వం ఉంద‌ని, అందుకే ఆయ‌న్ను ఎంపీగా పోటీ చేయకుండా ర‌ద్దు చేయాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. ఢిల్లీకి చెందిన జై భ‌గ‌వాన్ గోయ‌ల్‌, చంద‌ర్ ప్ర‌కాశ్ త్యాగీలు ఆ పిటిష‌న్ వేశారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ క్షేమం కోసం పిటిష‌న్‌దారులు పోరాటం చేశార‌ని, వారి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ తెలిపారు. రాహుల్‌కి బ్రిటీష్ పౌర‌స‌త్వం ఉంద‌న్న అంశంపై ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల‌ని పిటిష‌న్‌లో సుప్రీంను కోరారు. కాగా, రాహుల్ ద్వంద్వ పౌర‌స‌త్వం ఉంద‌న్న అంశంపై ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది.