రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు

|

Oct 14, 2020 | 1:37 PM

ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. దసరా, దీపావళీ దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు
Follow us on

ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. దసరా, దీపావళీ పండగల దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. జోన్లవారీగా 392 ప్రత్యేక రైళ్లను ప్రయాణీకుల కోసం  అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది. (Indian Railways To Run 392 Festival Special Trains)

ఈ కొత్త రైల్ సర్వీసులు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నడవనుండగా.. వీటి టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో కొన్ని రోజూ నడుస్తుండగా.. మరికొన్ని వారంలో నాలుగు రోజులు, ఇంకొన్ని వీకెండ్‌లో నడవనున్నాయి. ఇక ఈ రైళ్లన్నీ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ కొత్త ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు నవంబర్ 30 వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ విషయంలో పాత రిజర్వేషన్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానుంది. వీటిల్లో చాలా రైళ్లు ఏసీ ఎక్స్‌ప్రెస్, దురోంటో, రాజధాని, శతాబ్ది కేటగిరీకి చెందినవి. ఈ అదనపు రైళ్ల నిర్వహణ తేదీని మాత్రం ఇండియన్ రైల్వేస్ ఇంకా ప్రకటించలేదు. 

Also Read: ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!