బ్రిటన్ పార్లమెంట్ మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన విద్యావేత్త, యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్ గౌరవ ప్రొఫెసర్ ప్రేమ్ సిక్కా బ్రిటన్ ఎగువసభకు ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సర్ ఇయాన్ బోతం, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జోసెఫ్ జాన్సన్, మాజీ ఆర్థిక మంత్రులు కెన్ క్లార్క్, ఫిలిప్ హమ్మండ్ తో పాటు 36 మంది బ్రిటన్ ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డస్ కు సభ్యులుగా ఎన్నికయ్యారు. బ్రిటన్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఆమోదించారు.
1977లో అసోనియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ నుంచి చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 1982లో లండన్ స్కూల్ ఆప్ ఎనామిక్స్ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు సిక్కా. 1991లో షెఫీల్డ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ లో పీహెచ్ డీ చేశారు. 1995 లో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సాంఘిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా సాధించారు. 1996 లో ఎసెక్స్ వర్సిటీలో అధ్యాపకుడిగా తన తొలి ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రేమ్ సిక్కా. ప్రస్తుతం ఆయన షేఫీల్డ్ యూనివర్సిటీలో అకౌంటింగ్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా, అకౌంటింగ్ వృత్తిలోని లోపాలను ప్రేమ్ సిక్కా ఎప్పడు తప్పుబట్టేవారు. ప్రభుత్వ సంస్థలను ఆడిట్ చేయడంలో, దేశీయ సంస్థలు పన్నులు ఎగ్గొట్టడానికి సహాయపపడానికి అకౌంటెంట్ల పాత్రను బహింరంగంగానే విమర్శించేవారు. ఆడిటింగ్ వైఫల్యాలు, కార్పోరేట్ పాలన సమస్యలు, మనీలాండరింగ్, దివాలా, పన్ను ఎగవేత గురించి ది గార్డియన్ కోసం సిక్కా వ్యాసం కూడా రాశారు.