బ్రిటన్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్తపై ఐదేళ్ల నిషేధం..!

బ్రిటన్‌ లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్మాస్యూటికల్‌ హోల్‌సేలర్‌కు సరఫరా చేసే విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో యూకే కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.

బ్రిటన్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్తపై ఐదేళ్ల నిషేధం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 3:34 PM

బ్రిటన్‌ లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్మాస్యూటికల్‌ హోల్‌సేలర్‌కు సరఫరా చేసే విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో యూకే కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. బ్రిటన్‌ లోని ఏ కంపెనీలోనూ వచ్చే 5 ఏళ్ల పాటు డైరెక్టర్‌ హోదాలో కొనసాగడానికి వీల్లేకుండా భారత సంతతికి చెందిన ఫార్మా అధిపతి అమిత్‌ పటేల్‌పై నిషేధం విధించారు. ఔషధాల ధరల నిర్ణయంలో ఆయన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన యూకే కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సీఎమ్‌ఏ) 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.2014 సెప్టెంబరు నుంచి 2015 మే నెల వరకు అడెన్‌ మెకెంజీకి అమిత్ పటేల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి నార్ట్రిఫ్టిలైన్‌ ఔషధానికి సంబంధించి ఒక పెద్ద ఫార్మాస్యూటికల్‌ హోల్‌సేలర్‌కు సరఫరా చేసే విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు సీఎమ్‌ఏ గుర్తించింది. పోటీని పరిమితం చేసుకునే ఉద్దేశంలో భాగంగా ఒక సంస్థ 25 ఎంజీ, మరో సంస్థ 10 ఎంజీ మాత్రలను తయారు చేసింది. అయితే, పరిమాణం, ధర విషయంలో వ్యాత్యాసాలు ఉన్నాయని.. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారని సీఎమ్‌ఏ పేర్కొంది. అలాగే 2016 మార్చి 1 నుంచి అక్టోబరు 19 వరకు అమిల్కో ఫార్మా డైరెక్టర్‌గా పటేల్‌ కొనసాగిన సమయంలోనూ మరో ఫార్మా కంపెనీ టియోఫార్మాతో కలిసి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డట్లు రురుజువు కావడంతో నిషేధం విధిస్తూ సీఎమ్‌ఏ నిర్ణయం తీసుకుంది. ఫార్మాసీ కంపెనీ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని అతిక్రమించి వినియోగదారుల అవసరాల్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తే కఠినచర్యలు తప్పని సీఎమ్‌ఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ గ్రెన్‌ఫెల్‌ వెల్లడించారు.