తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

|

Sep 11, 2020 | 12:58 PM

తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 13న బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డుతుంద‌ని, దీని ప్ర‌భావంతో  తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Follow us on

Heavy Rains in Telangana : తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 13న బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డుతుంద‌ని, దీని ప్ర‌భావంతో  తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రేప‌టి (శనివారం) నుంచి భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది.

ఇవాళ రాష్ట్రంతోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉరుములు, పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అల్పపీడ‌న ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా భారీ వాన‌లు కూరుస్తాయ‌ని వెల్ల‌డించింది. అయితే ఇప్పడికే తెలంగాణ రాష్ట్రాలో గొలుసుకట్టు చెరువులు, జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నదులు కూడా అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి ఆయకట్టు ప్రాంతాలు ఇంకా నీటిలో ఉన్నాయి. అయితే మరిన్ని వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో..? అనే అంశంపై అధికారులు సమీక్షించారు. గోదావరి మరింత ఉప్పొంగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి ప్రవహించే జిల్లాల్లో ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు.