భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ సాక్షాత్కరించింది. స్టేడియానికి హాజరైన భారత జట్టు ఫ్యాన్ ఒకరు.. ఆస్ట్రేలియా టీమ్ మహిళా అభిమానికి లవ్ ప్రపోజ్ చేశాడు. చుట్టూ అంతమంది మధ్యలో ప్రపోజ్ చెయ్యడంతో సదరు యువతి తన్మయత్వానికి లోనయ్యింది. వెంటనే అతడి ప్రపోజల్ అంగీకరించింది. దీంతో వారిద్దరూ హగ్ చేసుకుని..స్టేడియం సాక్షిగా ముద్దు పెట్టుకున్నారు. అదే సమయంలో మ్యాచ్ ఆడుతున్న మ్యాక్స్వెల్.. నవ్వుతూ, చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేశాడు. ప్రేక్షకులు కూడా అతడికి జత కలిశారు. కాగా ఈ సమయంలో ఆస్ట్రేలియా టీమ్ మహిళా అభిమాని ఆసిస్ టీమ్ జెర్సీలో ఉండగా..మనవాడు ఇండియా జెర్సీలో ఉండటం విశేషం.
Finally an Indian has won something in Australia on this tour .#AUSvIND pic.twitter.com/6KusQXbL5P
— Abhishek Singh (@abhis1ngh) November 29, 2020
సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదుగురు బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వీరిలో స్మిత్(104), వార్నర్(83), ఫించ్(60), లబుషేన్(70), మ్యాక్స్వెల్(63) ఉన్నారు.
Also Read : అటు రాజకీయాలు, ఇటు సినిమాలు..రెండిటిలోనూ పవనే హాట్ టాపిక్ !