బలపడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ!

| Edited By:

Apr 08, 2019 | 6:32 PM

భారత దేశ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ బలపడటానికి కారణాలను వివరిస్తూ, భారత దేశంలో పెట్టుబడులు పటిష్టమయ్యాయని, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని, వినియోగం సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి నిలదొక్కుకుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు […]

బలపడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ!
Follow us on

భారత దేశ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ బలపడటానికి కారణాలను వివరిస్తూ, భారత దేశంలో పెట్టుబడులు పటిష్టమయ్యాయని, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని, వినియోగం సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి నిలదొక్కుకుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ స్ప్రింగ్ మీటింగ్ త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రపంచ బ్యాంకు ఈ వివరాలను వెల్లడించింది.