భారత ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదించిన యుద్ధ విమానాలను తీర్చిదిద్దుతోంది హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్). అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేస్తోంది హెచ్‌ఏఎల్. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించింది.
అయితే, ఇందులో భాగంగా బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తయారు చేసిన లైట్ అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్(ఎల్‌ఏహెచ్)ను ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదౌరియా శుక్రవారం విజయవంతంగా నడిపారు. ఉదయం 11.45 నుంచి గంట పాటు ఆయన గగనతలంలో విహరించారు. విశ్రాంత వింగ్ కమాండర్ ఎస్.పి.జాన్ హెలికాప్టర్‌లో కో -పైలట్‌గా వ్యవహరించారు. గగనతలంలో లైట్ అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్‌ను నడపడం చక్కని అనుభవమని భదౌరియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఏఎల్ ఛైర్మన్ ఆర్.మాధవన్, ఇతర అధికారులతో ఎయిర్ చీఫ్ మార్షల్ ముచ్చటించారు. రానున్న రోజుల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు మాధవన్ తెలిపారు.
Chief of the Air Staff, Air Chief Marshal #RKSBhadauria flew a sortie on the LCH at HAL, Bengaluru on 20 Nov 20. He was recieved by Dr R Madhavan CMD HAL. CAS interacted with the test crew, engineers and ground crew involved with the LCH programme. pic.twitter.com/ZYip3dpDLy
— Indian Air Force (@IAF_MCC) November 20, 2020