AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM 1st T20I: టాస్ గెలిచిన భారత్.. తుఫాన్ బ్యాటింగ్.. సరికొత్త పేస్ ఎటాక్‌తో బరిలోకి..!

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హరారే పిచ్‌పై బాన్స్ ఉండే అవకాశం ఉండటంతోనే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సిరీస్‌లో బోణీ కొట్టడమే లక్ష్యంగా మైదానంలోకి దిగిన భారత్, సరికొత్త యువ రక్తంతోపాటు సీనియర్ల కలయికతో తుది జట్టును ప్రకటించింది.

IND vs ZIM 1st T20I: టాస్ గెలిచిన భారత్.. తుఫాన్ బ్యాటింగ్.. సరికొత్త పేస్ ఎటాక్‌తో బరిలోకి..!
Ind Vs Zim Toss
Venkata Chari
|

Updated on: Jul 23, 2026 | 4:26 PM

Share

జింబాబ్వే పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో మొదటి పోరు ఉత్కంఠగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత సారథి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి అంచనాలు లేకుండా బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. ఈ మైదానంలో ఆడటం తనకు ఇదే తొలిసారని, ప్రాక్టీస్ వికెట్లను పరిశీలిస్తే బంతికి మంచి బౌన్స్ లభించేలా కనిపిస్తోందని అయ్యర్ స్పష్టం చేశాడు. పిచ్ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేయాలనేది టీమిండియా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

హరారే పిచ్‌పై సికందర్ రజా వ్యాఖ్యలు!

మరోవైపు జింబాబ్వే నాయకుడు సికందర్ రజా పిచ్ స్వభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఇది సాధారణంగా కనిపించే హరారే పిచ్ కాదు, మ్యాచ్ ప్రారంభంలో బంతి కాస్త స్వింగ్ అయ్యే అవకాశం ఉంది, అయితే అది ఎక్కువ సేపు ఉండకపోవచ్చు” అని రజా అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్‌ను దృష్టిలో ఉంచుకుని తాము నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్లు అతడు వెల్లడించాడు.

తుఫాన్ బ్యాటింగ్.. సరికొత్త పేస్ ఎటాక్!

భారత జట్టు విషయానికి వస్తే తుది జట్టు అత్యంత సమతుల్యంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వగా, మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే, ఎక్స్‌ప్రెస్ వేగానికి మారుపేరైన మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ పేస్ బాధ్యతలు మోస్తుండగా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

పిచ్‌ను సరిగ్గా అంచనా వేసి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టాలని చూస్తోంది. యువ ఆటగాళ్లతో కళకళలాడుతున్న టీమిండియా ఈ తొలి మ్యాచ్‌లో ఏ స్థాయి ప్రదర్శనతో బోణీ కొడుతుందో చూడాలి.

జట్లు:

జింబాబ్వే ప్లేయింగ్ XI: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.

భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

Follow Us