India Vs Australia 2020: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల.. 191 పరుగులకు ఆలౌట్.. ఆధిక్యం భారత్‌దే..
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. టీమిండియా బౌలర్ల ధాటికి...
India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/55) స్పిన్ మాయాజాలంతో ఆసీస్ జట్టును బెంబేలెత్తించాడు.
స్మిత్(1), హెడ్(7), గ్రీన్(11) వంటి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్లను అశ్విన్ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. అతడికి ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) కూడా తోడవ్వడంతో.. ఆసీస్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ టిమ్ పైన్ (73*) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక లబుషేన్ (47) రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
ఇదిలా ఉంటే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఆదిలోని పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 9/1 పరుగులు చేసింది. బుమ్రా(0), మయాంక్(5) క్రీజులో ఉన్నారు.
Also Read:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..