మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 అడుగుల లోయలో పడిన బస్సు.. ఒకరు మృతి, 70 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధార్ జిల్లాలో వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి మహిళ మృతి చెందగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధార్ జిల్లాలో వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి మహిళ మృతి చెందగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వలసకూలీలు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఘటనస్థలానికి చేరుకున్న స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో 40 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని రాజ్‌ఘఢ్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.