India-UK Flights: భారత్ ‌- యూకే విమానాలపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కేవలం ఈ ఎయిర్‌ పోర్ట్‌ల నుంచే అవకాశం.

|

Jan 01, 2021 | 9:41 PM

India-UK Flights Resume From: బ్రిటన్‌ కేంద్రంగా కొత్త స్ట్రెయిన్‌ కరోనా పుట్టుకురావడంతో భారత ప్రభుత్వం ఇండియా-యూకేల నడుమ విమానా సర్వీసులపై

India-UK Flights: భారత్ ‌- యూకే విమానాలపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కేవలం ఈ ఎయిర్‌ పోర్ట్‌ల నుంచే అవకాశం.
Follow us on

India-UK Flights Resume From: బ్రిటన్‌ కేంద్రంగా కొత్త స్ట్రెయిన్‌ కరోనా పుట్టుకురావడంతో భారత ప్రభుత్వం ఇండియా-యూకేల నడుమ విమానా సర్వీసులపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింహ్ పురీ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా  ప్రకటించారు. జనవరి 8 నుంచి భారత్‌-యూకే మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు. అయితే.. ఈ నెల 23 వరకు వారానికి కేవలం 15 సర్వీసులు మాత్రమే నడపాలని అనుమత్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి మాత్రమే ఇరు దేశాల మధ్య విమానా సర్వీసులు నడవనున్నట్లు స్పష్టం చేశారు. విమాన సేవల పునరుద్దరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

Also Read: నూతన సంవత్సరం తొలి రోజే కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్.. సమర్ధవంతంగా ఎదురుకొన్న భారత బలగాలు