గుడ్ న్యూస్.. ఇక భారత్‌లోనే కరోనా టెస్టు కిట్ల తయారీ..: హర్షవర్దన్

| Edited By:

Apr 28, 2020 | 8:27 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా టెస్టు కిట్ల సమస్య తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. స్వదేశంలోనే వీటిని తయారు చేసేందుకు కసరత్తు ఆరంభించింది.

గుడ్ న్యూస్.. ఇక భారత్‌లోనే కరోనా టెస్టు కిట్ల తయారీ..: హర్షవర్దన్
Follow us on

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా టెస్టు కిట్ల సమస్య తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. స్వదేశంలోనే వీటిని తయారు చేసేందుకు కసరత్తు ఆరంభించింది. మే నెలాఖరుకు భారత్‌లోనే ఆర్‌టీ-పీసీఆర్‌, యాంటీ బాడీ టెస్టు కిట్లను ఉత్పత్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి, డాక్టర్‌ హర్షవర్దన్‌ అన్నారు. అన్ని ప్రక్రియలు అధునాతన దశలో ఉన్నాయని హర్షవర్దన్‌ తెలిపారు. ఐసీఎంఆర్‌ నుంచి ఆమోదం లభించగానే టెస్టు కిట్ల ఉత్పత్తి ఆరంభిస్తామని పేర్కొన్నారు. మే 31కల్లా దేశంలో రోజుకు లక్ష పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.

కాగా.. చైనా నుంచి దిగుమతి చేసుకున్న యాంటీబాడీ టెస్టు కిట్ల ఫలితాల్లో ఎంతో వైరుధ్యం కనిపిస్తోంది. ఫలితాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని ఉపయోగించొద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఐసీఎంఆర్‌ సూచించింది. డబ్బులు ఇంకా చెల్లించలేదు కాబట్టి ఒక్క రూపాయి సైతం నష్టం ఉండదని స్పష్టం చేసింది. తమ సంస్థలు తయారు చేసిన టెస్టు కిట్ల ఫలితాల్లో తేడాలు కనిపించడంతో చైనా విచారం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆ దేశ దౌత్యకార్యాలయం వెల్లడించింది.

[svt-event date=”28/04/2020,8:16PM” class=”svt-cd-green” ]