Again Lockdown: దేశంలో కరోనా విలయం.. లాక్‌డౌన్‌ బాటలో రాష్ట్రాలు..

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి.

Again Lockdown: దేశంలో కరోనా విలయం.. లాక్‌డౌన్‌ బాటలో రాష్ట్రాలు..

Updated on: Jul 12, 2020 | 10:54 AM

Again Lockdown: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగాలాండ్, మేఘాలయ, మహారాష్ట్ర రాష్ట్రాలు మరోసారి కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కర్ణాటక క్యాపిటల్ బెంగళూరులో ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లో ఈ నెల 14 రాత్రి గం. 8.00 నుంచి – జూలై 22 ఉదయం గం. 5.00 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ఉండనుంది. అటు నాగాలాండ్‌లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవ్వరూ కూడా బయటికి రాకూడదని.. కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు హెచ్చరించారు. అటు మేఘాలయలో జూలై 13,14 తేదీల్లో కఠినతరమైన లాక్‌డౌన్‌ అమలు కానుండగా.. మహారాష్ట్రలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఇక ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెలాఖరు దాకా లాక్‌డౌన్‌ను విధించారు.

Also Read: కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..