ఇండియాలో టీకామందుల ఉత్పత్తికి ఢోకా లేదని, నెలకు 500 మిలియన్ల వ్యాక్సిన్ ని యూకే, బెల్జియం వంటి విదేశాలకు ఎగుమతి చేసే సత్తా దేశానికి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 16 న ప్రారంభించింది. . కానీ వ్యాక్సిన్ల సేఫ్టీ, నాణ్యతపై ప్రజల్లో అపోహలు, అనుమానాలు అలాగే ఉన్నాయి. సోమవారం నాటికి దేశంలో సుమారు 56 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఈ శాతం మరింత పెరిగితే తప్ప, జులై నాటికీ దాదాపు 30 కోట్లమందికి టీకామందు ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఇండియా సాధించజాలదు. ఇది కోవిడ్ వైరస్ ను అదుపు చేయాలన్న లక్ష్యాన్ని నీరు గారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సుమారు 130 కోట్ల జనాభా ఉంది. అందరికీ టీకామందు ఇవ్వాలంటే ఇందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం.. వ్యాక్సిన్ తీసుకుంటే శారీరక రుగ్మతలు కలుగుతాయని, వంధ్యత్వం వస్తుందని చాలామంది హెల్త్ కేర్ వర్కర్లు సైతం భావిస్తున్నారని, కానీ ఇది తప్పని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వైరస్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ పాల్ వ్యాఖ్యానించారు.
Read Also: కరోనా వైరస్ పరిస్థితి అదుపులో ఉంది, నైట్ కర్ఫ్యూ అవసరంలేదు, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, మాస్కులు తప్పనిసరి.
Read Also :దేశంలో ‘స్ట్రెయిన్’ వైరస్ కలవరం.. ఆ రాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ విధింపు.. ఎప్పటివరకూ అంటే.!