Eli Lilly Covid Antibody Drug: కరోనా బాధితులకు గుడ్‌న్యూస్.. వైరస్ నియంత్రణకు మరో కొత్త మందు

|

Jun 01, 2021 | 4:06 PM

ఎలీ లిల్లీకి చెందిన ఔషధాలు మోనోక్లోనల్ యాంటీబాడీస్ బమ్లానివిమాబ్ 700ఎంజీ, ఎటెసెవిమాబ్ 1400ఎంజీ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతు ఇచ్చింది.

Eli Lilly Covid Antibody Drug: కరోనా బాధితులకు గుడ్‌న్యూస్.. వైరస్ నియంత్రణకు మరో కొత్త మందు
Eli Lilly Covid Antibody Drug
Follow us on

DCGI Approvals Eli Lilly’s Monoclonal Antibodies Drug: కరోనా బాధితులకు శుభవార్త.. కోవిడ్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఎలీ లిల్లీకి చెందిన ఔషధాలు మోనోక్లోనల్ యాంటీబాడీస్ బమ్లానివిమాబ్ 700ఎంజీ, ఎటెసెవిమాబ్ 1400ఎంజీ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతు ఇచ్చింది. కరోనా ఇన్ఫెక్షన్‌ సోకి మధ్యస్థ తీవ్రత కల్గిన రోగుల చికిత్సకు దీన్ని వినియోగించేందుకు డీసీజీఐ గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. ఈ ఔషధాన్ని తమ వెండర్లకు పంపిణీ చేయడంపై కంపెనీపై దృష్టిసారించింది. త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ ఎండీ (ఇండియా) ల్యూకా విసిని తెలిపారు.

అమెరికాకు చెందిన ఔషధ తయారీదారు ఎలి లిల్లీ అండ్ కో ఇవాళ రోజు తన యాంటీబాడీ డ్రగ్ కాంబినేషన్ భారతదేశంలో తేలికపాటి నుండి మోడరేట్ కరోనా చికిత్స కోసం అత్యవసర వినియోగ అనుమతి పొందిందని ఆయన చెప్పారు.

Read Also… 5G Phones Coming This June: ఈ నెల‌లో మార్కెట్లో సంద‌డి చేయ‌నున్న 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..