AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ గూఢచర్యం.. హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది కోత

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు ఆ మధ్య మన దేశ సైనిక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేసి గూఢచార కార్యకలాపాలకు పాల్పడిన విషయం గమనార్హం. దీంతో ప్రభుత్వం..

పాక్ గూఢచర్యం.. హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది కోత
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 7:32 PM

Share

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు ఆ మధ్య మన దేశ సైనిక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేసి గూఢచార కార్యకలాపాలకు పాల్పడిన విషయం గమనార్హం. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో కూడా సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నారు. ఢిల్లీలో గల పాక్ హైకమిషన్ ఆఫీసులో కొంతమంది ఉద్యోగుల నిర్వాకం గురించి పాక్ దౌత్యాధికారి తెలియజేసినట్టు హోమ్ శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 31 న ఇక్కడి ఇద్దరు ఉద్యోగులు రహస్యంగా తమ దేశానికి భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కాగా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు డ్రైవర్లపై  కొందరు పాకిస్థానీలు దాడులు జరిపి వారిని చిత్రహింసలు పెట్టారు. వారు ఈ నెల 22న ఢిల్లీకి తిరిగి వఛ్చి.. తమను ఎలా టార్చర్ పెట్టారో అధికారులకు వివరించారు. పైగా అక్కడి మన హైకమిషన్ కార్యాలయంలో ఇతర అధికారులను వేధిస్తున్నారని కూడా వారు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే