కరోనా కేసుల్లో రెండు రికార్డులు బ్రేక్ చేసిన ఇండియా

కరోనా వైరస్‌ పీడ భారత్ ను వీడటం లేదు. ఆదివారం అమెరికా రికార్డును సైతం భారత్ అధిగమించి ప్రమాదకర స్థాయిలో పయనిస్తోంది. ఒకే రోజు అత్యధిక కేసుల నమోదులో భారత్....

కరోనా కేసుల్లో రెండు రికార్డులు బ్రేక్ చేసిన ఇండియా

Updated on: Aug 31, 2020 | 2:59 PM

కరోనా వైరస్‌ పీడ భారత్ ను వీడటం లేదు. ఆదివారం అమెరికా రికార్డును సైతం భారత్ అధిగమించి ప్రమాదకర స్థాయిలో పయనిస్తోంది. ఒకే రోజు అత్యధిక కేసుల నమోదులో భారత్.. అగ్రరాజ్యాన్ని అధిగమించడమే కాకుండా మరో రికార్డునూ నెలకొల్పింది. ఆగస్టు 30న భారతదేశంలో 78,761 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జులై 17న అమెరికా పేరిట నమోదైన ఒకే రోజులో అత్యధిక కేసుల రికార్డును భారత్‌ దాటినట్లయింది.

అంతేకాదు భారత్‌లో ఆగస్టు 30నాటి కేసులు ప్రపంచంలో ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు కూడా. ఆ విధంగానూ భారత్ రెండు రికార్డులను ఒకే రోజు బ్రేక్ చేసినట్లైంది. ఇంతవరకూ పట్టణాల్లోనే అత్యధిక కేసులు నమోదవ్వగా ఇప్పుడు భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలలో కూడా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5కోట్లు దాటాయి. 8,43,000 మంది మరణించారు. 60 లక్షల యాక్టివ్ కేసులతో అమెరికా ప్రపంచంలోనే నెంబర్‌ వన్ ‌స్థానంలో ఉంది.